కేంద్ర ప్రభుత్వ విధనాలను నిరసిస్తూ ఈ నేల 16 జరిగే సమ్మెను జయప్రదం చేయండి....
CITU జిల్లా కార్యదర్శి సి హెచ్ సుధాకర్ ఫిబ్రవరి 16న జరిగే గ్రామీణ బంద్ ను జయప్రధం చేయాలనీ కోరుతూ బుదవారం కరపత్రం ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా సి హెచ్ సుధాకర్ మాట్లాడుతూ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుపరచకుండా మోసం చేస్తుందని విమర్శించారు. కార్పొరేట్ కంపెనీల లాభాలకు ఆటంకంగా ఉన్న కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్స్ తెచ్చిందని అన్నారు. ప్రత్యేక హోదాను నిరాక రించిందని, ప్రజలు పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మకానికి పెట్టిందని, కృష్ణా జలాల పంపిణీలో రాష్ట్రానికి ద్రోహం తలపెట్టిందని, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని వేధింపులకు గురిచేస్తుందని, రాష్ట్రాల హక్కులను హరించి వేస్తూ, దేశంలో మతోన్మాదాన్ని సృష్టిస్తుందన్నారు.అన్ని రైతు, కార్మిక సంఘాలు, అసోసియేషన్లు, ఫెడరేషన్లు, వినియోగదారుల సంఘాలు, వృత్తి సంఘాలు, ఉద్యోగ ఉపాధ్యాయ విద్యార్థి యువజన మహిళా తదితర సంఘాల వారందరూ పాల్గొని ఈ బందును జయప్రదం చేయాలన్నారు. రైతు సంఘం నాయకులు వి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ రైతు లు పండించి న పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి అనీ డిమాండు చేశారు, గ్రామాల్లోనిప్రజలు అందరినీ ఐక్యం చేసి గ్రామీణ బందును విజయవంతం చేయాలని, కోరారు, ఈ కార్యక్రమం లో సీఐటీయూ నాయకులు చన్నారావు, ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు sk కరీం, ముఠా కార్మికులు, ఆటో వర్కర్స్ పాల్గోన్నారు