ఇబ్రహీంపట్నం, మైలవరం నియోజకవర్గం, ఎన్టీఆర్ జిల్లా,
జి.కొండూరు మండలంలోని జి.కొండూరు నుంచి గంగినేనిపాలెం వరకు ఉన్నటువంటి కే జీ వై రోడ్ ను త్వరగా పూర్తి చేయించాలని మండలంలోని ఆయా గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు జడ్పిటిసి మరియు గ్రామ ఆయా గ్రామస్తులు అందరూ కలిసి గౌరవనీయులైన మంత్రి జోగి రమేష్ కి విన్నవించుకోవడం జరిగింది ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని రాకపోకలకు అంతరాయం కలుగుతుందని దీన్ని త్వరగా పూర్తి చేసినట్లయితే ప్రజలకు రాకపోకలకు అంతరాయము ఉండదని 10 గ్రామాల ప్రజలకు మేలు జరుగుతుందని గౌరవ మంత్రివర్యులు జోగి రమేష్ మా యందు దయ ఉంచి త్వరగా దీన్ని తగు చర్యలు తీసుకొని పూర్తి చేయించాలని వేడుకున్నారు.. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ వెంటనే అధికారులతో, మరియు కాంట్రాక్టర్ తో ఫోన్లో మాట్లాడి ప్రజలకు ఇబ్బంది లేకుండా త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు, అధికారులను ఆదేశించడం జరిగింది.. త్వరితగతిన ఈ రోడ్డును త్వరగా పూర్తి చేస్తామని అధికారులు హామీ ఇవ్వడం జరిగింది... ఈ సందర్భంగా మందా జక్రి, మరియు సర్పంచులు ఎంపీటీసీలు మరియు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు...
ఈ కార్యక్రమంలో దుగ్గిరాలపాడు గ్రామ సర్పంచ్ జడ రాంబాబు, గంగినేని పాలెం గ్రామ సర్పంచ్ పిల్లి రామారావు ఎంపీటీసీ పిల్లి ప్రసాదు, తెల్లదేవరపాడు గ్రామ సర్పంచ్ ఉమ్మడి ప్రసాదు,మునగపడు గ్రామ సర్పంచ్ పగడాల వెంకటేశ్వరావు,గంగినేనిపాలెం సొసైటీ బ్యాంకు ప్రెసిడెంట్ అన్నం శెట్టి వెంకటరావు,, చెన్నూరు సుబ్బారావు తుదితరులు పాల్గొన్నారు..