ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం ఎంపీడీవోగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఉమాదేవిని మండల పరిషత్ కో - ఆప్షన్ సభ్యుడు పఠాన్ నాగుల్ మీరా బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందించి దుశ్శాలువాతో సత్కరించారు. ఆయనతో పాటు కేతనకొండ గ్రామస్థుడు కొమ్మూరి అచ్చారావు ఉన్నారు.