యల్.బి.ఆర్.సి.ఈ కి APSSDC వారిచే ఉత్తమ శిక్షణా విద్యాలయ అవార్డు
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంజనీరింగ్ . ఐ.టి స్కిల్ వర్క్ షాప్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కళాశాలలకు ప్రోత్సహక అవార్డులు ప్రధానం చేశారు. ఈ అవార్డులను వారి వారి కళాశాలలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) వారి ఆధ్వర్యంలో సాంకేతిక నైపుణ్య శిక్షణా తరగతులలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన 6 కళాశాలకు ఉత్తమ విద్యాలయాలు అవార్డులను APSCHE ఛైర్మన్ శ్రీ.కె.హేమచంద్రా రెడ్డి చేతుల మీదుగా ప్రధానం చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో మొత్తం 240 కళాశాలలు వారు పాల్గొన్నారు. అందులో లకిరెడ్డి బాలిరెడ్డి కళాశాలకు కు ఉత్తమ విద్యాలయo అవార్డు లభించటం గర్వకారణమని కళాశాల ప్రిన్సిపాల్ డా.కె.అప్పారావు తెలిపారు. ఇందుకు తోడ్పడిన ఉపాధ్యాయులను, APSSDC SPOC డా.వై.విజయ భాస్కర్ రెడ్డి ని కళాశాలప్రెసిడెంట్ శ్రీ.జి.శ్రీనివాస రెడ్డి , ప్రిన్సిపాల్ డా.కె.అప్పారావు , వైస్ ప్రిన్సిపాల్ డా.కె.హరినాధ రెడ్డి మరియు డీన్స్ అభినందించారు