డీఎస్సీ జీవో ప్రతుల దహనం
మైలవరం, ఫిబ్రవరి 14 .ఎన్నో పోరాటాలు చేయడం ఫలితంగా రద్దు కాబడిన అప్రెంటిస్ విధానాన్ని, ఇటీవల ప్రభుత్వం డీఎస్సీ 2024 నోటిఫికేషన్ లో తిరిగి పునరుద్ధరించడాన్ని. తీవ్రంగా వ్యతిరేకిస్తూ మైలవరం యుటిఎఫ్ మండలశాఖ ఆధ్వర్యంలో డీఎస్సీ జీవో ప్రతులను దహనం చేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కే గంగరాజు , మైలవరం మండల ప్రధాన కార్యదర్శి వసంతరావు వాడపల్లి, సహాధ్యక్షులు బి బాలాజీ , కోశాధికారి జి రామకృష్ణ , ఏ శ్రీను , కె వరలక్ష్మి , పి నాగేశ్వరరావు పాల్గొనడం జరిగినది.